Natyam ad

సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

 

 

Post Midle

సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీరాములు, జెఈవో  వీరబ్రహ్మం దంపతులు, విఎస్వో  మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం, ఆగ‌మ స‌ల‌హాదారు  శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబు స్వామి, ఆర్జితం ఇన్స్పెక్టర్  దాము పాల్గొన్నారు.

Tags:Sirulatalli in the adornment of Lord Krishna on the vehicle of Sarvabhupala

Post Midle

Leave A Reply

Your email address will not be published.