Natyam ad

పేపర్ లీక్‌ కేసుపై టీఎస్‌పీఎస్సీకి సిట్ నివేదిక

పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి కీలక సూత్రధారి

ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రాజశేఖర్

పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుకకు అమ్మిన ప్రవీణ్‌

Post Midle

హైదరాబాద్  ముచ్చట్లు:

టీఎస్‌పీఎస్సీపేపర్ లీక్ కేసు లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్‌ కేసుపై టీఎస్‌పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి(కీలక సూత్రధారి అని తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి రాజశేఖర్ డిప్యుటేషన్‌పై వచ్చాడని సిట్ నివేదికలో వెల్లడించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని రాజశేఖర్ దొంగిలించాడని తేల్చారు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెబుతుండటంతో కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడని, కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని సిట్ నివేదికలో తెలిపారు

. ఏఈ పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుకకు ప్రవీణ్‌ అమ్మాడని తేల్చారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ పేపర్‌ను కాపీ చేశాడని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షాపత్రం లీకైనట్లు గుర్తించిన సిట్ ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై విచారణ జరిపింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుకతన తమ్ముడు రాజేశ్‌నాయక్‌ కోసం టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ప్రవీణ్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రశ్నపత్రాన్ని తమ తండాకే చెందిన నీలేశ్‌, శ్రీను, రాజేందర్‌నాయక్‌లకు ఇచ్చినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పరీక్షకు ముందురోజు వీరందరినీ వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్‌ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని వచ్చింది.

కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్‌ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. దీంతో రేణుకకు, వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్‌.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుకతోపాటు ఆమె సోదరుడిని, నీలేశ్‌ని, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌పీఎస్‌సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్‌ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్‌ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి కీలక సూత్రధారి
ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రాజశేఖర్
పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుకకు అమ్మిన ప్రవీణ్‌
హైదరాబాద్ మార్చ్ 18
టీఎస్‌పీఎస్సీపేపర్ లీక్ కేసు లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్‌ కేసుపై టీఎస్‌పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి(కీలక సూత్రధారి అని తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి రాజశేఖర్ డిప్యుటేషన్‌పై వచ్చాడని సిట్ నివేదికలో వెల్లడించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని రాజశేఖర్ దొంగిలించాడని తేల్చారు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెబుతుండటంతో కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడని, కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని సిట్ నివేదికలో తెలిపారు. ఏఈ పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుకకు ప్రవీణ్‌ అమ్మాడని తేల్చారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ పేపర్‌ను కాపీ చేశాడని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షాపత్రం లీకైనట్లు గుర్తించిన సిట్ ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై విచారణ జరిపింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుకతన తమ్ముడు రాజేశ్‌నాయక్‌ కోసం టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ప్రవీణ్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రశ్నపత్రాన్ని తమ తండాకే చెందిన నీలేశ్‌, శ్రీను, రాజేందర్‌నాయక్‌లకు ఇచ్చినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం మేరకు పరీక్షకు ముందురోజు వీరందరినీ వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్‌ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని వచ్చింది.
కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్‌ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. దీంతో రేణుకకు, వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్‌.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుకతోపాటు ఆమె సోదరుడిని, నీలేశ్‌ని, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌పీఎస్‌సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్‌ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్‌ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Tags;SIT report to TSPSC on paper leak case

Post Midle