ప్రగతి భవన్ దగ్గర సీతక్క అరెస్ట్

Date:18/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ములుగు ఎమ్మెల్యే సీతక్క రైతుల సమస్యలపై కదం తొక్కారు. అన్నదాతల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించలేదని, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్‌ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్దారు. ఇందుకు నిరసనగా ఆమె కాంగ్రెస్ కిసాన్ విభాగం ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఆమెతోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.దీంతో ఎమ్మెల్యే సీతక్క సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, సీతక్కకు మద్య తోపులాట జరిగింది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సీతక్క కారు దిగిన సమయంలో అడ్డుకొనే క్రమంలో తనపై చేయివేసిన మహిళా పోలీస్‌ను సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. చేయిఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆమె దుయ్యబట్టారు. ఈ ముట్టడికి యత్నించిన వారిలో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కిసాన్ సెల్‌ నేత అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఉప ముఖ్యమంత్రి కావాలని దుర్గమ్మకు వేడ్కోలు
Tags:Sitakka arrested near Pragati Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *