Natyam ad

సీతారాముల కల్యాణ వేదిక సిద్ధం

– టీటీడీ, జిల్లా అధికారుల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు

– భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ

– గ్యాలరీలలో ఎయిర్ కూలర్లు

Post Midle

– భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్లు

– భక్తులకు తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం

 

ఒంటిమిట్ట‌ ముచ్చట్లు:

వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో సోమవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్నప్రసాదాలు, తాగునీరు విద్యుత్‌, పుష్పాలంకరణలు, భద్రత, సౌండ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది.టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా వేదిక వద్ద బారికేడ్లు, రోప్‌లు, మెగా ఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదిక వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, ఒక్కో గ్యాలరీకి
వర్కర్లను నియమించింది. లక్షకు పైగా మజ్జిగ, నాలుగు లక్షలకు పైగా వాటర్ పాకెట్లను సిద్ధంగా ఉంచారు. దాదాపు 580 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

 

 

సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు 280 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు. ఇందులో పులిహోర, చక్కర పొంగలి ఒక్కొక్కటి 50 వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. వీటిని కల్యాణం రోజున 150 అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు.ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, 28 ఎల్ ఈడి స్క్రీన్‌లు, హై-ఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు చేశారు.కళ్యాణ వేదికను 30 వేల కట్‌ ఫ్లవర్‌లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు . దాదాపు 100 మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు.కళ్యాణానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు. టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు గ్యాలరీలకు ఇరువైపులా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు.

Tags:Sitaram’s welfare platform is ready

Post Midle