Site inspection for construction of bypass road at Choudepalle

చౌడేపల్లెలో బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు స్థల పరిశీలన

– ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖల సమన్వయంతో సర్వే
– స్థలంతో పాటు రూటును పరిశీలించిన పెద్దిరెడ్డి
– అందరి సమ్మతితో ఆక్రమణల తొలగింపు
– అభివృద్దికి అందరూ సహకరించాలి

Date:27/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

చౌడేపల్లెలోని బోయకొండ బైపాస్‌ వద్ద ఏర్పాటుచేసిన ఆర్చి వద్దనుంచి ఆమినిగుంట వద్దకు కలిసే విధంగా బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. మంగళవారం జెడ్పిటీసీ సభ్యుడు దామోదరారరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, మాజీ ఎంపీటీసీ కడియాల నగేష్‌ డెప్యూటీ తహసీల్దార్‌ మాధవిలతో కలిసి రోడ్డు ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ సధంర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల సమన్వంతో రోడ్డు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరించడానికి సర్వే చేయాలని సూచించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు రోడ్డు ఏర్పాటు చేయాల్సి వస్తోందని అంచనా వేశారు. ప్రజలకు, రైతులకు, వాహనాదారులకు సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు స్థలంను కొందరు ఆక్రమించుకొన్నారని ఇటీవల ఆర్‌అండ్‌బి , రెవెన్యూఅధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్చంధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొన్న వరకు తొలగించాలని గ్రామఅభివృద్దికి అందరూ సహకరించాలని కోరారు.అందరి సహకారంతో చౌడేపల్లె మండలాన్ని అభివృద్ది చేసుకొనేందుకు మద్దత్తు ఇవ్వాలని కోరారు. బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధాకర్‌నాయక్‌, విఆర్వోలు మల్లికార్జునరెడ్డి, గుర్రప్ప, నేతలు చెంగారెడ్డి, రవిరెడ్డి, పాల్గొన్నారు.

వైఎస్సార్‌కాలనీలో కాలువల ఏర్పాటుకు చర్యలు

Tags; Site inspection for construction of bypass road at Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *