పుంగనూరులో ఆర్టీవో కార్యాలయం నిర్మాణానికి స్థల పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీవో కార్యాలయం కోసం పక్కా భవనం నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు డీటీసీ నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన స్థానిక మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డితో కలసి గూడూరుపల్లె, రాగానిపల్లె ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. డీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు స్థలాన్ని ఎంపిక చేసి, భవన నిర్మాణ పనులు చేపడుతామన్నారు. ఆర్టీవో ఆఫీసుకు అనువైన స్థలంగా రాగానిపల్లె ప్రాంతం అనువుగా ఉంటుందని నివేదికలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఈయన వెంట స్థానిక మున్సిపల్ సర్వేయర్ కిరణ్మయి, ఎంవిఐ రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags;Site inspection for construction of RTO office at Punganur
