Natyam ad

పుంగనూరులో జగనన్న కాలనీకి స్థల పరిశీలన – కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పేదలకు జగనన్న కాలనీలలో స్థలాలు కేటాయింపు కోసం స్థల పరిశీలన చేసినట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని రాగానిపల్లె, గూడూరుపల్లె వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, తహశీల్ధార్‌ సీతారామన్‌తో కలసి స్థలాలను పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాల కోసం ధరఖాస్తు చేసిన 1002 మందికి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు గూడూరుపల్లె , రాగానిపల్లె వద్ద 17 ఎకరాల భూమిని సేకరించామన్నారు. నివేదికలను జిల్లా కలెక్టర్‌కు పంపి , పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మహేష్‌, ఏఈ కృష్ణకుమార్‌, హౌసింగ్‌ ఏఈ హేమంత్‌కుమార్‌, సర్వేయర్‌ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Site Inspection for Jagananna Colony in Punganur – Commissioner Narasimhaprasad Reddy

Post Midle