పుంగనూరులో రూ.6కోట్లతో సోలార్‌ప్లాంటుకు స్థల పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సుమారు రూ. 6 కోట్లతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యచరణ ప్రణాళిక సిద్దం చేశారు. మంగళవారం ఈ మేరకు కమిషనర్ నరసింహప్రసాద్, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, మంత్రి పీఏ చంద్రహాస్, కాంట్రాక్టర్లతో కలసి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు వద్ద స్థల పరిశీలన చేశారు. ట్యాంకు వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండ సోలార్ ప్రాజెక్టు నిర్మించేందుకు వీలుందన్నారు. చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటిలో ప్రతినెల సుమారు రూ.50 లక్షలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి పెద్దిరెడ్డి, సోలార్‌ప్లాంటు నిర్మించి , మున్సిపల్ నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారన్నారు. త్వరలోనే ఈ పనులను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రస్తుతం ప్లాంటు నిర్మాణం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు వద్దనే బాగుంటుందని మంత్రికి నివేదిస్తున్నామన్నారు. మంత్రి అనుమతి మేరకు పనులు ప్రారంభిస్తామన్నారు.
Tags: Site inspection for Rs.6 crore solar plant in Punganur

