Natyam ad

పుంగనూరులో టపాకాయల దుకాణాలు ఏర్పాటుకు స్థల పరిశీలన

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలనను ఆదివారం సాయంత్రం చేపట్టారు. తహశీల్ధార్‌ సీతారామన్‌ , సీఐ రాఘవరెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు కలసి క్లబ్‌లో దుకాణాలు ఏర్పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి లైసెన్సు దారులతో చర్చించారు. తహశీల్ధార్‌ మాట్లాడుతూ లైసెన్సులు పొందిన వారు మాత్రమే దుకాణాలు ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించి దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే లైసెన్సులు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు.

 

Post Midle

Tags: Site survey for setting up of crockery shops in Punganur

Post Midle