ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల  భవన నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేయాలి- జిల్లా కలెక్టర్ జి.రవి.

-ప్రతి సబ్ సెంటర్ కోసం కనీసం 300 గజాల స్థలం ఎంపిక చేయాలి.
-మున్సిపాలిటీ లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
-గోడల పై ఉన్న పిచ్చి రాతలు వారం రోజుల్లో తోలగించాలి.
-ఆరోగ్య సబ్ సెంటర్ల భూమి కేటాయింపు పై  అధికారులతో జిల్లా కలెక్టర్ రివ్యూ
జగిత్యాల ముచ్చట్లు :
జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల శాశ్వత భవన నిర్మాణం కోసం అనుకూలమైన స్థలాలు వెంటనే ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారంఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల నూతన భవన నిర్మాణం, స్థలాల ఎంపిక, పట్టణ పారిశుధ్యం,  వంటి పలు అంశంపై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.జిల్లాలో 151 ఆరోగ్యకేంద్రాల సబ్ సెంటర్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 25 సబ్ సెంటర్ల సోంత భవనాలు ఉన్నాయని, 25 సబ్ సెంటర్ల కోసం స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించామని అధికారులు వివరించారు.
జిల్లాలో ప్రస్తుతం 101 ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని గతంలో ఆదేశాలు జారీ చేసామని కలెక్టర్ గుర్తు చేశారు.ధర్మపురి, ఖమ్మం పల్లి ,మల్యాల కొత్తపేట,మల్లాపూర్, మాదాపూర్ మొదలైన పలు సెంటర్లు మినహాయించి మిగిలిన సబ్ సెంటర్లకు భూములు కేటాయింపు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య సబ్ సెంటర్ ఏర్పాటుకు కనీసం 300 గజాలప్రభుత్వ భూమి గుర్తించాలని, గుర్తించిన భూములకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ అంశంలో అధికారుల పనితీరును కలెక్టర్ ప్రశంసించారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ సైతం పెండింగ్ ఉండకుండా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు వైద్యులు కనీసం 120 అవుట్ పేషెంట్ చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెయిన్ రోడ్లు మినహా  ఆశించినస్థాయిలో లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలలో ముఖ్యమైన రోడ్లపై మాత్రమే పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని, అంతర్గత రోడ్లు సైతం పకడ్బందీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలనికలెక్టర్ ఆదేశించారు.జగిత్యాల మున్సిపాలిటీల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, రోడ్లపై చెత్త గార్బేజ్ అధికంగా ఉంటుందని, వీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని పలు ప్రదేశాల్లోప్రభుత్వ గోడలపై ఉన్న అనవసమైన పిచ్చి రాతలు  వారం రోజుల్లో తొలగించాలని, సదరు గోడలను వైట్ వాష్ చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల కోసం అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లతశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,  రెవెన్యూ డివిజన్ అధికార్లు, డి.ఎం.హెచ్.ఓ.,  మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు,డి.పి.ఓ., మండల పంచాయతీ అధికారులు, వైద్య అధికారులు తదితరులు  పాల్గొన్నారు.
 
Tags:Sites should be selected for the construction of primary health sub-centers – District Collector G. Ravi.

Leave A Reply

Your email address will not be published.