పుంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా శివశంకర్‌నాయుడు ,ఆనంద్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు శుక్రవారం జరిగాయి . నూతన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా గల్లాశివశంకర్‌నాయుడు, కార్యదర్శిగా కెవి.ఆనంద్‌కుమార్, ఉపాధ్యక్షుడు జమీల్, ట్రెజరర్‌గా శరత్‌కుమార్ లు ఎంపికైనట్లు ఎన్నికల అధికారి పిఎన్.బాలాజికుమార్, వై.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి ఇద్దరు న్యాయవాదులు పోటీపడటంతో ఎన్నికలు జరిగాయి. 43 ఓట్లతో శివశంకర్‌నాయుడు విజయం సాధించారు. శివశంకర్‌నాయుడు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు నివేదికలు సిద్దం చేసి రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను శనివారం కలసి అందజేస్తామన్నారు. వారి సూచనల మేరకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను న్యాయవాదులు అభినందించారు.

Tags: Sivashankar Naidu and Anand are the president and secretaries of Punganur Advocates Association
