శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు జయప్రదం చేయండి

Sivasivasi celebrates the celebrations of the Kanyakapaceeshwari Jayanti

Sivasivasi celebrates the celebrations of the Kanyakapaceeshwari Jayanti

Date:12/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బజారువీధిలో వెలసియుండు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు 13 నుంచి నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఆర్యవైశ్య సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జయంతి వేడుకలు ఉదయం పుష్కరిణి నుంచి గంగతీర్థం తీసుకొచ్చి, పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. నిరంతర పూజలు కొనసాగిస్తామన్నారు. అలాగే 14న 102 కలిశ తీర్థాలతో అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే రాత్రి అమ్మవారిని పుష్పపల్లకిలో పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పండ రీభజన, పిల్లనగ్రోవి, కీలుగుర్రాలు, బాణ సంచాలతో వైభవంగా ప్రదర్శన జరుగుతుందన్నారు. 15న విశేషపూజలతో పాటు అభిషేకము, రాత్రి ఊంజల్‌సేవా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారి జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొని , అమ్మవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు ముల్లంగి విజయకుమార్‌, సంఘ ప్రతినిధులు ఆర్‌వి.బాలాజి, పిఎల్‌.ప్రసాద్‌, దొంతి వెంకటేష్‌బాబు, బానుప్రసాద్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

 

నేపాల్‌లో కరాటే పోటీలకు వెళ్లి విద్యార్థులు

Tags; Sivasivasi celebrates the celebrations of the Kanyakapaceeshwari Jayanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *