చంబల్‌ నదిలోపడవ మునిగి ఆరుగురు భక్తుల మృతి

Date:16/09/2020

జైపూర్‌ ముచ్చట్లు:

రాజస్థాన్‌ కోటాలోని చంబల్‌ నది వద్ద ఘోరం జరిగింది. 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. బాధితులంతా బుండి జిల్లాలోని కమలేశ్వర మహాదేవ్‌ దేవాలయానికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.

ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

Tags;Six devotees drowned in Chambal river

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *