రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయలు

Date:21/11/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూల్ జిల్లా మహానంది మండలం శ్రీనగరం గ్రామం సమీపంలోని రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణిస్తున్న ఆటో, కారు వాహనాలు బలంగా ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఒక చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడింది.బాధితులను తమ వాహనంలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న అర్చన, తన తల్లిదండ్రులతో కలసి మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చారు.తిరుగు ప్రయాణంలో శ్రీనగరం సమీపంలోకి వచ్చే సరికి మలుపులో వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొంది.ఆటో వెంటనే బోల్తా పడింది.ఈ ఘటనలో డాక్టర్‌ అర్చన తోపాటు అందరూ గాయపడ్డారు. చిన్నారి మాత్రం క్షేమంగా బయట పడింది. ఇన్నోవా వాహనంలోని ఓ వృద్ధురాలు సైతం గాయపడింది. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఆరు లీటర్ల నాటుసారా స్వాధీనం

 

Tags:Six injured in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *