డీఎస్సీకి ఆరు లక్షల దరఖాస్తులు

Date:21/11/2018
విజయవాడ ముచ్చట్లు:
డీఎస్సీ – 2018కి అన్ని కేటగిరీలకు కలిపి 6,08,157 దరఖాస్తులు అందాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. 6.26 లక్షల మంది ఫీజు చెల్లించగా, 6.08 లక్షల మంది అభ్యర్థులే దరఖాస్తు చేశారని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్-లాంగ్వేజెస్) పోస్టులకు 1,12,197 మంది, స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) పోస్టులకు 31,807 మంది, లాంగ్వేజ్ పండిట్లకు 24,330 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 3,45,115 మంది, పీఈటీ పోస్టులకు 13840 మంది, మ్యూజిక్‌కు 641 మంది, ఆర్ట్ అండ్ డ్రాయింగ్‌కు 1258 మంది, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులకు 1722 మంది, పీజీటీకి 22,775 మంది, టీజీటీకి 44,723 మంది, స్పెషల్ స్కూల్ పోస్టులకు 913 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకూ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22 నుంచి 28 వరకూ స్కూల్ అసిస్టెంట్లకు, పీజీటీలకు, 24 నుంచి 30 వరకూ టీజీటీ, ప్రిన్సిపాల్, పీఈటీ, ఆర్ట్సు అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, లాంగ్వేజ్ పండిట్లు, డిసెంబర్ 3 నుంచి 9 వరకూ ఎస్జీటీలు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 1 నుంచి 3 వరకూ స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్), 5 నుంచి పీజీటీ అభ్యర్థులు, 9 నుంచి టీజీటీ, క్రాఫ్ట్, ఆర్టు అండ్ డ్రాయింగ్, మ్యూజిక్, లాంగ్వేజ్ పండిట్లు, 17 నుంచి ఎస్జీటీలు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Tags:Six lakh applications for DSC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *