విశాఖలో ఎన్ కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి

విశాఖపట్టణం ముచ్చట్లు:

 

కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట వ‌ద్ద బుధవారం గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురుమావోయిస్టులు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో మంప పోలీస్‌స్టేసన్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.యితే ఎదురు కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారన్న దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. సంఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియడానికి కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. ఘ‌ట‌నాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయి. ఈ ఘటన తర్వాత మావోయిస్టు అగ్రనేత‌లు త‌ప్పించుకున్నార‌న్న స‌మాచారంతో భద్రతా దళాలు హెలికాప్టర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Six Maoists killed in encounter in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *