టీపీసీసీ ఛీఫ్ రేసులో ఆరుగురు..

Date:7/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అర డజనుకు పైగా నేతలు కన్నేసినట్లు తెలుస్తోంది. మంగళవారం గాంధీభవన్‌లో నేతల వాగ్వివాదంతో ఈ అంశం ప్రస్ఫుటమైంది. గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ సాక్షిగా తెలంగాణ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు.టీపీసీసీ పదవిపై కన్నేసిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఓటమి తర్వాత తన ప్రయత్నాల్లో వేగం పెంచినట్లు కనిపిస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న నేతల ద్వారా పీసీసీ పదవి మార్పుపై ఆజాద్ సమక్షంలో ప్రస్తావన వచ్చేలా చేసి సఫలమయ్యారు. పీసీసీ చీఫ్‌ను మార్చాలంటూ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచించారుహుజూర్‌నగర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీసీసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలను పరిశీలించడానికి ఆజాద్‌ను పంపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ పదవిపై కన్నేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా గాంధీభవన్‌ వద్ద కోమటిరెడ్డి అనుచరులు పీసీసీ పదవి తమ నేతకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు.

 

 

 

 

 

 

 

 

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ కుమార్ తదితర నేతలు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ప్రచారం చేసేందుకు ఆజాద్ మంగళవారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు వీ హనుమంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని ఆజాద్ దృష్టికి వీహెచ్ తీసుకెళ్లారు. పార్టీ సీనియర్లకు తెలియకుండా ఏకపక్షంగా వివిధ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని, పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీలో సమన్వయం లేదని ఆయన అన్నారు.షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక తీవ్రంగా నెలకొని ఉందని, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, వీహెచ్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకోవడంతో ఆజాద్ జోక్యం చేసుకొని సద్దుమణిగేలా చూశారు. పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరించాలని సర్ది చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలని కోరారు. పార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని పోతానని, పార్టీని పటిష్టం చేస్తానని ఆజాద్‌ను కోరారు.

 

ఆమ్ ఆద్మీకి ఊపిరొచ్చింది

 

Tags:Six of TPCC chief’s race ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *