సిక్సర్లు లేకుండానే ఒక్కో బాల్ లో ఆరు పరుగులు

Date:10/01/2019
ముంబై ముచ్చట్లు:
క్రికెట్‌లో తక్కువ బంతులకు ఎక్కువ రన్స్ కొట్టాల్సిన సందర్భాలు చాలా సార్లు వస్తాయి. అలాంటి మ్యాచ్‌లు భలే ఉత్కంఠ రేకెత్తిస్తాయి. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైనప్పుడు బ్యాట్స్‌మ్యాన్ సిక్స్ కొట్టి విజయం సాధించడం సాధారణమే. కానీ, బ్యాట్స్‌మ్యాన్ ఒక్క పరుగు కూడా కొట్టకుండా ఆరు పరుగులు సాధిస్తే? భలే చిత్రంగా ఉంటుంది కదూ. మహారాష్ట్రలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో అదే జరిగింది. ఆదర్శ్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన మ్యాచ్‌లో దేశాయ్- జుని దొంబివ్లి అనే జట్లు తలపడ్డాయి. 5 ఓవర్లకు 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దేశాయ్ జట్టు.. 4.5 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
విజయం సాధించాలంటే చివరి బంతిలో 6 పరుగులు చేయాలి. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాట్స్‌మ్యాన్ 6 కొడితే విజయం తమదే అనే ఆశతో దేశాయ్ జట్టు ఉంది. ఆ ఒక్క బంతితో కట్టడి చేస్తే తామే విజేతలమనే ధీమతో జుని డొంబివ్లి జట్టు ఉంది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బౌలర్ చివరి బంతిని వైడ్‌గా వేశాడు. దీంతో లక్ష్యం 5 పరుగులకు తగ్గింది. అయితే, విజయానికి అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆ తర్వాత వేసిన బంతి కూడా వైడ్ అయ్యింది. లక్ష్యం 4 పరుగులకు తగ్గిపోయింది. దీంతో ఇరు జట్లలో టెన్షన్ మరింత పెరిగింది. బౌలర్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే, వైడ్ల పరంపర అంతటితో ఆగలేదు. మిగతా నాలుగు బంతులు కూడా వైడ్లే వేశాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే దేశాయ్ జట్టును విజయం వరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
Tags:Six runs on each ball without the sixes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *