Natyam ad

ఆరుగురు దొంగలు అరెస్టు

గుంటూరు ముచ్చట్లు:


గుంటూరు జిల్లాలో పట్టపగలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేసారు. కేసు వివరాలను  గుంటూరు జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ వెల్లడించారు.  వెస్ట్ బెంగాల్ కు చెందిన నిందితులు పగలు రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారు.  చెత్త కాగితాల ఏరుకుంటు దొంగతనాలకు పాల్పడి అనంతరం ట్రైన్ లో వెళ్ళిపోతారు.  గతంలో వీరిపై వెస్ట్ బెంగాల్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి.  వీటికోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి వీరిని వెస్ట్ బెంగాల్ లో అదుపులోకి తీసుకున్నాం.  వీరి వద్ద నుంచి 30 లక్షల విలువ చేసే బంగారం,వెండి వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.  గుంటూరు వెంగలయపాలెం మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ చేస్తున్నాం.  ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.

 

Tags: Six thieves arrested

Post Midle
Post Midle