ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారం

Date:07/12/2019

కోల్‌కతా ముచ్చట్లు:

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ మరో ఘోరం జరిగింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ ఏరియాకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.అనంతరం చిన్నారిని బాత్రూమ్‌లో వేసి తాళం పెట్టి వెళ్లాడు. అయితే చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. చుట్టపక్కల మొత్తం వెతికారు. చివరకు అనుమానం వచ్చి బాత్రూమ్‌ తలుపులు తెరవగా తీవ్ర గాయాలతో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పక్కింటి కుర్రాడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించామని, రిపోర్ట్‌ అనంతరం తదుపరి విచారణ చేపడతామని చెప్పారు.

 

చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్‌కు తక్షణమే రిజర్వేషన్స్ తొలగించాలి

 

Tags:Six-year-old child raped next door

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *