Natyam ad

ఆరవైఏళ్లకల…జగనన్నతో సాకారం…-పెద్దాయన కృషి ఫలితం

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు ఆరు దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోని పుంగనూరు- బెంగళూరు రహదారి పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాగానే పెద్దాయన రోడ్డు పనులు మంజూరు చేయాలని జగనన్నను కోరడంతో నిధులు మంజూరై , రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post Midle

జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ…

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల కోరిక మేరకు పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు మంజూరు చేశారు. అలాగే కర్నాటకలోని జాతీయ రహదారిని పుంగనూరు రోడ్డులో అనుసందానం చేస్తూ నియోజకవర్గంలోని రొంపిచెర్ల వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు విడుదల చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పనులు చురుగ్గా చేపట్టారు.

19 మంది సీఎంలు చేయలేని ….

పుంగనూరు -బెంగళూరు రోడ్డును విస్తరించాలని , ప్రమాదాలు అధికంగా జరుగుతోందని 1970 లో తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి పుంగనూరు పర్యటించారు. అప్పటి జెడ్పి చైర్మన్‌ టిఎన్‌.నాగిరెడ్డి రోడ్డును విస్తరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కానీ ఆ సమయంలో నిధుల కొరత ఉందని, త్వరలోనే పనులు చేస్తామని కాసు బ్రహ్మనందరెడ్డి చె ప్పి పుంగనూరు నుంచి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి 19 మంది ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, అంజయ్య, మర్రిచెన్నారెడ్డి, కోట్లవిజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు , రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి దిగ్గజాలు పరిపాలన చేసినా పుంగనూరు ప్రజల వెహోర ఆలకించిన వారు లేరు. ప్రమాదాలతో విలవిలలాడుతున్న రోడ్డు విస్తరణకు నోచుకోని దౌర్భగ్యస్థితిలో మిగిలిపోయింది.

పెద్దాయన రాకతో….

నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తండ్రి, తనయుడు ఎంపీ మిధున్‌రెడ్డి కలసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాలంలో ఈ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని రాజన్నను కోరారు. మంజూరు సమయంలో రాజన్న మృతితో పనులు ఆగిపోయాయి. తిరిగి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బెంగళూరు రోడ్డు విస్తరణ కార్యక్రమం పనులు మంజూరు కావడం జరిగింది.

 

నాడు జనాభా తక్కువ…

జమీందారుల కాలంలో సుమారు 11 వేల జనాభా కలిగిన పట్టణంలో ఏర్పాటు చేసిన బెంగళూరు రోడ్డు ఆనాటికి సరిపోయింది. ప్రస్తుతం జనాభా 60 వేలు ఉంది. అలాగే పుంగనూరు కర్నాటక సరిహద్దుకావడం, బెంగళూరుకు దూరం తక్కువ కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలోప్రయాణిస్తున్నాయి. కానీ విస్తరణకు నోచుకోలేదు. 30 ఏళ్లు పాలించిన ఒకే కుటుంబం ఈ రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించలేదు. ఇలా ఉండగా విస్తరణకు నోచుకోక సుమారు 40 అడుగుల రోడ్డులో వాహనాలు ప్రమాదం అంచున పయనించేవి. ఈ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజలు మృత్యువాత పడటం , క్షతగాత్రులుకావడం జరిగింది. కానీ రోడ్డు రూపురేఖలు మార్చలేకపోయారు.

రోడ్డు పనులు…

పుంగనూరు-బెంగళూరు జాతీయ రహదారిగా మార్పు చేయించడంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కీలకపాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వంలో అనుమతులు పొందారు. పుంగనూరు నుంచి కర్నాటక సరిహద్దుకు సుమారు 11 కిలో మీటర్ల రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చి నూతన తారురోడ్డు వేశారు. అలాగే పుంగమ్మ చెరువు కట్టను డబుల్‌ రోడ్డుగా మార్చారు. అలాగే చెరువు కట్ట నుంచి రామసముద్రంకు వెళ్లేందుకు కట్టపై మరో నూతన రహదారిని ఏర్పాటు చేసి సర్కిల్‌ ఏర్పాటు చేశారు. చెరువు కట్టకు ఒక వైపు సిమెంటు కాంక్రీట్‌ గోడలు నిర్మిస్తూ రోడ్డును 100 అడుగుల వెడల్పుతో విస్తరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే 50 రాళ్ల వెహోరవ వద్ద రెండు కల్వర్టులు, మార్లపల్లె , సింగిరిగుంట , అరవపల్లె వద్ద మూడు కల్వర్టులు నిర్మిస్తున్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో చురుగ్గా సాగుతున్న పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి.

అభివృద్దే లక్ష్యం…

అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ కోట్లాది రూపాయలతో రోడ్లను ఏర్పాటు చేసి, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు నియోజకవర్గంపై ఎంతో అభిమానంతో అడిగిన పనులన్ని మంజూరు చేస్తున్నారు. 60 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్డును అత్యంత సుందరంగా ఏర్పాటు చేసి, ఆదర్శవంతమైన పట్టణంగా నిర్మిస్తాం. అలాగే కట్టపై దీపాలు, పార్కు ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సిమెంటు, తారు రోడ్లు వేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నాం.

– రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పుంగనూరుకు గుర్తింపు….

రాజకీయ కక్ష్యలతో అభివృద్ధికి నోచుకోని పుంగనూరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశాం. సీఎం జగనన్న ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. 60 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని బెంగళూరు రోడ్డును విస్తరించి, జాతీయ రహదారికి అనుసందానం చేశాం. ఆర్టీసి డిపోఏర్పాటు, బైపాస్‌రోడ్డు, మిని బైపాస్‌రోడ్లు వేశాం. పుంగనూరులో ఆర్టీవో , ట్రాన్స్కోడీఈ కార్యాలయం ఏర్పాటు చేశాం. ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. ఈ విధంగా మరెన్నో కార్యక్రమాలను పూర్తి చేశాం.

– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ ,రాజంపేట.

’’కాసు ’’కాదన్నారు…

1970లో ముఖ్యమంత్రిగా ఉన్న కాసుబ్రహ్మనందరెడ్డి రోడ్డు విస్తరణను చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిదులు కోరారు. కానీ నిధులు లేవని కాదన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎంత మంది ముఖ్యమంత్రులకు రోడ్డు మరమ్మతులపై వెహోరపెట్టుకున్నా ఫలితం లేదు. నేను 70 సంవత్సరాలుగా చూడని, ఎవరు చేయలేని బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు నిర్వహించారు. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి , మంత్రి కుటుంభానికి మాకృతజ్ఞతలు .

– పి.దక్షిణామూర్తి, మాజీ సర్పంచ్‌.

పెద్దిరెడ్డితోనే అభివృద్ధి….

పుంగనూరు నియోజకవర్గం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎంతో అభివృద్ధి చెందుతోంది. నిర్లక్ష్యానికి గురైన పుంగనూరును మంత్రి పెద్దిరెడ్డి అంచలంచలుగా అభివృద్ధి చేస్తున్నారు. పుంగమ్మ చెరువు కట్ట విస్తరణను ఇక నేను చూడలేనని అనుకున్నా. కానీ నాకోరిక నేరవేరింది. ఎంతో సుందంరగా పట్టణ రోడ్డు అభివృద్ధి చెందుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, మంత్రికి రుణపడి ఉంటాం.

– పి.ఖాదర్‌ఖాన్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌.

 

Tags: Six years old

Post Midle