మున్సిపల్‌ కార్మికుల ఆరవ రోజు దీక్షలు

Sixth day of municipal workers' initiatives

Sixth day of municipal workers' initiatives

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి , కార్మిక సంఘ అధ్యక్షుడు శ్రీరాములు డిమాండు చేశారు. మంగళవారం కార్మికులు బైఠాయించి, దీక్షలు చేపట్టారు. ఆరవ రోజు ధర్నా కార్యక్రమాన్ని ఉద్ధేశించి వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్నా , ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను రద్దు చేయాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పట్టణం విస్తరిస్తున్నందున విస్తరణ ప్రాంతాలకు కొత్త కార్మికులను నియమించాలని , కార్మికులందరికి ఇండ్లు, పెన్షన్‌ , ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయమై వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, వెంకట్రమణ, రెడ్డెమ్మ, చిన్న నాగయ్య, నాగమ్మ, ఈశ్వరమ్మ, కవిత, ఎం.లక్ష్మి, శీరిష, ఆంజప్ప, సుమన్‌, రాములు, బాబు, అంజి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల భవనానికి రూ.50 వేలు విరాళం

Tags: Sixth day of municipal workers’ initiatives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *