మూడు నెలలనుంచే స్కెచ్ 

Sketch by three months

Sketch by three months

 Date:18/09/2018
నల్గోండ  ముచ్చట్లు:
మూడు నెలల నుంచే ప్రణయ్ మర్డర్ కు నిందితులు స్కెచ్ వేశారు. జూలై మొదటి వారంలోనే ప్లాన్ వేశారు. అమృత తండ్రి మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం నాడు ప్రణయ్ హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అమృత తండ్రి  మారుతీ రావు ఏ1,  ఏ2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ,  ఏ3 గా ఉగ్రవాది అస్గర్ అలీ, ఏ4 గా మహ్మద్ బారీ, ఏ5గా అబ్దుల్ కరీం, ఏ6 గా అమృత బాబాయ్  శ్రవణ్,  ఏ7గా  మారుతిరావు డ్రైవర్  సముద్రాల శివగౌడ్ కేసు నమోదు చేసారు. తరువాత కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు.   హత్యకు కోటి రూపాయలను డిమాండ్ చేసిన అస్గర్ చివరకు రూ. 50 లక్షలకు ఒప్పుకున్నాడని అయన అన్నారు.
మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారని చెప్పారు  ఆగస్ట్ 9వ తేదీ నుంచి రెక్కీ జరిగింది. మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ఆగస్ట్ 14న ప్రణయ్ ని చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. తరువాత  ఆగస్ట్ 17న వెడ్డింగ్ రిసెప్షన్ రోజు మరో ప్రయత్నం చేసారు. తరువాత ఆగస్ట్ 22న ఇంటి వద్దే ప్రణయ్ ను హత్య చేసేందుకు విఫల యత్నం చేశారని తెలిపారు. చివరకు ఈ నెల 14న ప్రణయ్ ను హతమార్చారు. అస్గర్ డైరెక్షన్ లోనే ప్రణయ్ మర్డర్ ప్లాన్ ను అమలు చేశారని ఎస్పీ తెలిపారు.
Tags:Sketch by three months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *