Natyam ad

ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణలో పుర్రెలు, పిండాల ఎముకలు

-వెలికి తీసిన పోలీసులు… వైద్యురాలు డాక్టర్ రేఖా కదమ్, నర్సు  అరెస్ట్‌
 
ముంబాయ్  ముచ్చట్లు:
 
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణలో కనీసం 11 పుర్రెలు 54 పిండాల ఎముకలను పోలీసులు వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు అక్రమ అబార్షన్ కేసును విచారిస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ఆ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన  వైద్యురాలు  డాక్టర్ రేఖా కదమ్, నర్సుని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…13 ఏళ్ల బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించుకోమని  బాలికతో సంబంధం పెట్టుకున్న మైనర్‌ బాలుడి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వచ్చారు.ఈక్రమంలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ బాలికను అబార్షన్‌ చేయించుకోకపోతే నీ పరువు తీస్తామని బెదిరించారు. అంతేకాదు ఆమెకు అబార్షన్‌ చేయించేందుకు వైద్యులకు డబ్బులు కూడా ఇచ్చారు. ఒక బాలికకు బలవంతంగా అబార్షన్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించాం. అప్పుడు ఆర్వీ తహసీల్‌లోని కదమ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్‌ను తనీఖీ చేస్తుండగా పిండాలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఆ మైనర్‌ బాలుడి తల్లితండ్రులను, వైద్యురాలిని, నర్సుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం అని పోలీసులు తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Skulls and fetal bones on the premises of a private hospital

Leave A Reply

Your email address will not be published.