స్కైలాబ్‌’ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన మిల్కీబ్యూటీ తమన్నా

 

సినిమాముచ్చట్లు:

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వ‌క్ కందెరావ్‌ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. అందులో స్కైలాబ్ పై సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణతో పాటు మరికొందరు కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి.
అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. అలాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్ర్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో  ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూ ‘స్కైలాబ్‌’ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని చిత్రయూనిట్ తెలియజేసింది.
న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Skylab ‘title’, MilkyBeauty Tamanna released by Firstlook‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *