మార్కెట్ ను ముంచెత్తుతున్న ఆఫర్లు…

Sleeping offers on the market ...

Sleeping offers on the market ...

Date:14/07/2018
అనంతపురం ముచ్చట్లు:
 ఆషాడం ఆఫర్లు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు వివిధ రకాల ఆషాడం ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నా బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వస్త్ర వ్యాపారాలు కూడా ఆషాడంలో తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.కొంత మంది ఆషాడమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదరుచుస్తుంటారంటే ఆషాడాని ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా షాపింగ్‌ మాల్స్‌ నిర్వాహకులు కూడా ఒకటి కొంటే ఒకటి ఉచితం. 50శాతం డిస్కోంట్‌. ఒకటి కొటే రెండు ఉచితం… తదితర ప్రకటనలతో ఊదరొగడుతుంటారు. 40, 60, 70 శాతం డిస్కౌంట్‌ అంటూ భారీ ఎత్తును ప్రకటనలు చేస్తున్నారు. దీంతో వస్త్ర ప్రియులు షాపులు దారి పడుతున్నారు. వినియోగారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఫాపుల వారిచ్చిన పేపరు ప్రకటన కన్నా వినియోగదారులు మౌత్‌టు మౌత్‌ ప్రచారంతో కొనకపోయినా ఒక్క సారైనా చూసివద్దామన్న వారు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయ షాపుల యజమానులు కూడా దుకాణాలను సందరంగా అలంకరించి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.ఆషాడం ఆఫర్లకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మానవుడు ఆశాజీవి. ఏ మైలనైనా చిన్నలాభం కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంటారు. సరిగా దానినే వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. సాధారణ రోజులు, పండగలు, పెళ్లిళ్ల రోజుల్లో ఒక షాపింగ్‌ మాల్‌ రోజుకు రూ.2 నుంచి రూ.5 లక్షలు వ్యాపారం చేసుకుంటాయ అనుకుంటే, ఆషాడ మాసంలో అది రూ.5 నుంచి రూ. పది లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఆషాడం సేల్‌ సంతృప్తికరంగా ఉందని ఒక షాపింగ్‌ మాల్‌ ప్రతినిధి తెలిపారు. నగరంలో సుమారు పది వరకు షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. వీటితో చిన్నా చిన్న షాపులు వందకు పైగా ఉన్నాయి. వాటిన్నింటిలో కూడా ఆషాడం ఆఫర్లు కొనసాగిస్తున్నారు. చిన్న షాపుల కంటే షాపింగ్‌ మాల్స్‌ వారే ఎక్కువగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు.వస్త్ర వ్యాపారాల పరిస్థితి ఇలా ఉంటే బంగారు దుకాణాల పరిస్థితి మరోలా ఉంది. బంగారు యజమానులు ఆషాడం ఆఫర్లు ఏవీ ప్రకటించరు. తరుగులో పర్సంటేజ్‌ ఇస్తున్నా కొనుగోలుదారులు దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెద్ద పెద్ద షాపులు గ్రామకు డిస్కౌంట్‌లు, వజ్రాభరణాలపై రాళ్లు ధర తగ్గించడం వంటి ప్రకటనలు చేస్తున్నా పెద్దగా పలితాన్ని ఇవ్వడం లేదు. బంగారం, వెండి ధరలు తగ్గకపోవడంతో కొనుగోలుదారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. రానున్న శ్రావణమాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్న వారు మాత్రమే ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆషాడంలో బంగారు కొనుగోళ్లు ఆసక్తికరంగా లేవని వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.
మార్కెట్ ను ముంచెత్తుతున్న ఆఫర్లు… https://www.telugumuchatlu.com/sleeping-offers-on-the-market/
Tags:Sleeping offers on the market …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *