ఏపీలో కర్ఫ్యూ స‌డలింపుల్లో స్వ‌ల్ప మార్పులు

రాష్ట్రామంతా థియేట‌ర్లు, జిమ్‌లు, ఫంక్ష‌న్ హాళ్ల‌ను తెరిచేందుకు అనుమ‌తి
అమ‌రావ‌తి    ముచ్చట్లు:
కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో కర్ఫ్యూ స‌డలింపుల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఉద‌యం 6 నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌డ‌లించారు. అయితే సాయంత్రం 6 గంట‌ల‌కే దుకాణాలు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగ‌తా జిల్లాల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపులు ఇచ్చారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌ వ‌చ్చేంత‌ వ‌ర‌కు ఆంక్ష‌ల కొన‌సాగింపు ఉంటుంద‌ని తెలిపింది. ఇక రాష్ర్ట‌మంతా థియేట‌ర్లు, జిమ్‌లు, ఫంక్ష‌న్ హాళ్ల‌ను తెరిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Slight changes in curfew relaxations in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *