Gold and silver prices

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Date:06/03/2020

ముంబై ముచ్చట్లు:

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట. నిన్న దిమ్మతిరిగే షాకిచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం కొంత మేర దిగొచ్చింది. అయినా కూడా బంగారం ధర ఇంక కొండ మీదనే ఉంది. ఇప్పుడు బంగారం కొనాలంటే చుక్కలు కనిస్తాయి. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా తగ్గింది.బంగారం ధర దిగిరావడానికి ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం కూడా పసిడిపై ప్రభావం చూపింది. అయితే రూపాయి బలహీనంగానే ఉండటం వల్ల బంగారం ధర తగ్గుదల పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు.

 

 

 

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. రూ.170 మేర పడిపోయింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,310 నుంచి రూ.45,140కు తగ్గింది. అంటే ఇక్కడ పసిడి ధర ఇంకా రూ.45 వేల మార్క్ పైనే కదలాడుతోందని చెప్పుకోవచ్చు.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. ఇది కూడా రూ.170 మేర తగ్గింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.41,530 నుంచి రూ.41,360కు క్షీణించింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే వచ్చింది. ఈరోజు మాత్రం తగ్గింది.

 

 

 

గత 4 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,670 పెరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాములకు రూ.1,650 మేర ర్యాలీ చేసింది.పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.180 మేర క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.50,030 నుంచి రూ.49,850కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం పెరిగింది. 1,650 డాలర్ల పైన కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 1651.25 డాలర్లకు పరుగులు పెట్టింది.

 

 

 

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు చేరింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.41,360కు క్షీణించింది. వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

 

 

 

 

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. రూ.150 మేర క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.42,400 నుంచి రూ.42,250కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 క్షీణతతో రూ.43,600 నుంచి రూ.43,450కు తగ్గింది. ఇక వెండి ధర కూడా రూ.180 తగ్గుదలతో రూ.49,850కు క్షీణించింది.

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా…

Tags: Slightly reduced gold prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *