Natyam ad

చిన్న చౌక్,అల్మాస్ పేటలను తనిఖీ చేసిన కమీషనర్

కడప ముచ్చట్లు:

 

కడప నగర పాలక సంస్థ కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్  మార్నింగ్ విజిట్ లో భాగంగా ఎన్జీవో కాలనీ, చిన్నచొక్, భాగ్యనగర్ కాలనీ, అల్మాస్పేట ప్రాంతాలను తనిఖీ చేశారు.
ఎన్జీవో కాలనీ చిన్న చౌక్ భాగ్యనగర్ కాలనీ నందు జరుగుతున్న మస్టర్ (మస్టర్) పాయింట్లను అకస్మాత్మిక తనిఖీ చేశారు.పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారికి కేటాయించిన సమయానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సానిటేషన్ విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

అనంతరం అల్మాస్పేట ప్రాంతంలో ఉందో తనిఖీ చేస్తూ ఇంటింటి చెత్త స్వీకరణలో కేటాయించిన క్లబ్ వాహనాల తో ఆ ప్రాంతము అంతయు కూడా స్వయంగా పరిశీలించి వారు ఏ విధముగా చెత్తను సేకరిస్తున్నారు పరిశీలించారు.అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడుతూ చెత్త ను వేయి సమయమునందు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఏ విధంగా వేరు చేసుకోవాలో వారికి అవగాహన కల్పించారు.ఆ ప్రాంతం నందు ఫాగింగ్ మరియు స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణలో భాగంగాతీసుకోవాల్సిన నియమాలు, ప్రక్రియను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మలేరియా విభాగపు సిబ్బంది వారికి ఆదేశాలు జారీ చేశారు.

 

Post Midle

Tags: Small Chowk, Commissioner who inspected Almas Patta

Post Midle

Leave A Reply

Your email address will not be published.