జగన్ కు చిరు ప్రశంసలు

హైదరాబాద్  ముచ్చట్లు :

చిరంజీవి ప్రశంసలు జల్లు కురిపించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం జగన్ సర్కారు పనితనానికి నిదర్శనమని కొనియాడారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నం బాగుందని, ఒక్కరోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించడం అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు.కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. వాస్తవానికి ఒక్క రోజులో 8 లక్షల మంది వ్యాక్సిన్ వేయాలని ముందుగా లక్ష్యం పెట్టుకోగా.. దాన్ని అధిగమిస్తూ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ రికార్డు నెలకొల్పారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Small compliments to Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *