Natyam ad

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి- ఎం.డి అనుపమ అంజలి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటి ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. దేశంలోని స్మార్ట్ సిటీలతో బుధవారం స్మార్ట్ సిటీ మిషన్ జాయింట్ సెక్రటరీ, మేనిజింగ్ డైరెక్టర్ కునల్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి స్మార్ట్ సిటి నుండి ఎండి అనుపమ అంజలి పాల్గొని చర్చించడం జరిగింది.  అనంతరం స్మార్ట్ సిటి ఎండిఅనుపమ అంజలి మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన భవనంతో కలిపి సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం పనులు త్వరగా చేపట్టెలా చూడాలన్నారు. తిరుపతి రైల్వే పార్శిల్ ఆఫీసు ఎదురుగా నిర్మించబోయే మల్టి లెవల్ కార్ పార్కింగ్ కోసం గత సమావేశంలోనే పెరిగిన అంచనా వ్యయంపైచర్చించి ఆమోదించడం
జరిగిందని గుర్తు చేస్తూ పనులు చేపట్టె ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  శ్రీనివాససేతు పనులు 85 శాతం పూర్తి కావడాన్ని ప్రసంసిస్తూ మిగిలిన పనులు పూర్తికి కృషి
చేయాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి దేశంలోనే తిరుపతి స్మార్ట్
సిటికి మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటి ఎస్.ఈ మోహన్, ఏఓరాజశేఖర్, సి.ఎఫ్.ఓమల్లిఖార్జున్, డిఈ మోహన్, ఏయికామ్ సిబ్బంది  పాల్గొన్నారు.

 

Tags: Smart city projects should be accelerated- MD Anupama Anjali

Post Midle
Post Midle