కల్తీ పాలకు స్మార్ట్  ఫోన్ చెక్

Smart phone check for adulterated milk

Smart phone check for adulterated milk

Date:27/11/2018
ముంబై ముచ్చట్లు:
పాలల్లో కల్తీని స్మార్ట్ ఫోన్ ద్వారా కనిపెట్టే సరికొత్త విధానం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఒక ఇండికేటర్ పేపర్‌ను వినియోగించడం ద్వారా ఆ పేపర్ రంగుల్లోకి మారితే పాలల్లో వాతగుణాలు (కల్తీ) ఉన్నట్లు నిర్ధారించేలా ఈ విధానం రూపొందించారు. ఇందుకు సంబంధించి స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టే ‘ఆల్గోరిథమ్స్’ అనే మరో విధానాన్ని ఈ పరిశోధకులు కనుగొన్నారు. ఇలా ఈ విధానాన్ని ఇన్‌కార్పొరేట్ చేసిన స్మార్ట్ఫోన్ ద్వారా కల్తీపాలు రంగుమారడాన్ని కనుగొనవచ్చు. దీన్ని కనుగొన్న పరిశోధకుల బృందానికి ఐఐటీ ఫ్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ నేతృత్వం వహించారు. ప్రస్తుతం పాల కల్తీని కనుగొనేందుకు వినియోగిస్తున్న క్రొమేటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ విధానాలు చాలా ఖర్చుతో కూడుకున్న సాంకేతిక పద్ధతులని, పైగా ఇవి డివైస్‌ల్లోకి జొప్పించగలిగి తక్కువ ఖర్చుతో చేసేలా మార్చగలిగేవీ కావని, అందుకే తక్కువ ఖర్చుతో వినియోగదారులు కల్తీపాలును గుర్తించే విధానాన్ని కనుగొనాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఫ్రొఫెసర్ శివ గోవింద సింగ్ తెలిపారు. కాగా ఈ పరిశోధకుల బృందం తొలుత ఫ్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాతాన్ని(ఎసిడిటీని) స్థాయిని అంచనావేసే సెన్సార్ చిప్‌ను అభివృద్ధి చేసింది. తర్వాత ‘ఎలక్ట్రో స్పిన్నింగ్’ అనే విధానాన్ని వినియోగించి ఓ ప్రత్యేక పేపర్‌ను రూపొందించారు. నేనో సైజ్డ్ నైలాన్ ఫైబర్ మెటీరియల్‌ను కలిగిన ఈ పేపర్ ‘హాలోక్రోమిక్’గా పనిచేసి ఎసిడిటీని గుర్తించినపుడు రంగుమారే విధంగా పనిచేస్తుంది. దీన్ని వినియోగించి పరిశోధకులు స్మార్ట్ఫోన్‌లో వినియోగించే ప్రోటోటైప్ ‘ఆల్గోరిధమ్’ను అభివృద్ధి చేశారు. ఈ సెన్సార్ స్ట్రిప్స్‌ను పాలలో ముంచినపుడు కల్తీనీ గుర్తించేందుకు దోహదపడుతుంది.
Tags:Smart phone check for adulterated milk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *