గాల్లో చక్కర్లు కొట్టిన పొగమంచు

Smog hollow

Smog hollow

Date:14/01/2019
తిరుపతి ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో సోమవారం ఉదయం భారీగా పొగమంచు అలుముకుంది. కనీసం పది మీటర్ల దూరంలోని వాహనాలు సైతం కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఉదయం ఏడు గంటల నుంచి నాలుగు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తలు విమానాల్లో వస్తున్నారు. దీంతో విమాన సంస్థలు సైతం సర్వీసులు పెంచాయి. ఇదే సమయంలో భోగి రోజు పొగమంచు అలుముకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గాల్లో చక్కర్లు కొడుతున్న ఓ విమానంలో సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. తన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. వెలుతురు పెరిగితేనే ల్యాండింగ్‌కు అనుమతి ఇస్తామని, లేని పక్షంలో చెన్నైకు విమానాలు మళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు.
Tags:Smog hollow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed