గర్భం రూపంలో గంజాయి స్మగ్లింగ్

Smoking marijuana in the form of pregnancy
Date:15/11/2019
న్యూ డిల్లీ ముచ్చట్లు:
ఈ మహిళకు మామూలు తెలివిలేదు. అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కైంది. సాధారణ పద్ధతుల్లో డ్రగ్స్‌ను తీసుకెళ్తే పోలీసులకు దొరికిపోతామని భావించిన ఆవిడ.. నకిలీ గర్భాన్ని సృష్టించుకుంది. గర్భం ఏ సైజులో అయితే ఉంటుందో ఆ మాదిరిగా గంజాయి ప్యాకెట్లను అమర్చుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. భార్యాభర్తలిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్జెంటీనాకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి మెండోజా నుంచి శాంత్ క్రూజ్‌కు బయల్దేరింది రైల్లో. పోలీసు ఆఫీసర్లు తనిఖీలు చేస్తుండగా భర్త బ్యాగులో గంజాయి ప్యాకెట్ బయటపడింది. దీంతో వారిద్దరిని పోలీసులు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ఆమెది నకిలీ గర్భమని తేలింది. గర్భం రూపంలో గంజాయి ప్యాకెట్లను దాచి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి
Tags:Smoking marijuana in the form of pregnancy