ఎయిర్ పోర్టులో స్మగ్లింగ్.

తిరువనంతపురం  ముచ్చట్లు:


అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోల్డర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా మంగుళూరు ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. క‌ర్నాట‌క‌లోని మంగుళూరు విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ శాఖ అధికారులు ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద భారీ స్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా భ‌త్క‌ల్‌కు చెందిన ఆ ప్ర‌యాణికుడు దుబాయ్ నుంచి ప్రైవేటు విమానంలో మంగుళూరుకు వ‌చ్చాడు.ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా భ‌త్క‌ల్‌కు చెందిన ఆ ప్ర‌యాణికుడు దుబాయ్ నుంచి ప్రైవేటు విమానంలో మంగుళూరుకు వ‌చ్చాడు. 24 క్యారెట్ల 364.5 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ.18.95 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. పేస్ట్ రూపంలో ఆ వ్య‌క్తి బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేశాడు. లేడీస్ అండ‌ర్‌గార్మెంట్స్ ఉన్న బాక్సులో ఓ ప్లాస్టిక్ పేప‌ర్‌లో ఆ బంగారాన్ని చుట్టి అత‌ను స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డ్డాడు.

 

Tags: Smuggling at the airport.

Post Midle
Post Midle