అమెరికాను వణికిస్తున్న నత్తలు

కోలంబో ముచ్చట్లు:


అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఈ జాతికి చెందిన ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. ఈ 1200 నత్తలు ఒక్కొక్కటి 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయి. ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినటం ఖాయం.ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సంక్రమిస్తే మనుషుల్లో జ్వరం, తలనొప్పి, మెదడుకు నీరుపట్టడం, కండరాల బలహీనత, ఫిట్స్, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది.

 

 

 

ఇలాంటి నత్తలు ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ నత్తలు తిరుగుతున్న విషయాన్ని ఫ్లోరిడా వ్యవసాయ, వినియోగదారుల సేవా విభాగం (FDACS) నిర్ధారించింది. ఈ నత్తలు ఏయే వస్తువులపై తిరిగాయో వాటిని ఇప్పుడు ప్రజలు ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని న్యూ పోర్ట్ రిచీ పట్టణంలో లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ ప్రకారం ప్రజలు తమ ఇళ్ల దగ్గర ఉండే మొక్కలు, మట్టి, చెత్త, కంపోస్ట్ వంటి వాటిని కదపకూడదు. నిర్మాణ వస్తువుల్ని కూడా అలాగే ఉంచాలి. వీటి సంగతిని పర్యావరణ రక్షణ ఏజెన్సీ చూసుకుంటుంది. ఈ నత్తల వల్ల మనుషులకే కాకుండా పర్యావరణానికీ హానే. ఈ నత్తలకు చెట్లు, కాంక్రీట్ అంటే ఇష్టం. దీంతో ఇవి పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ ఇళ్లలోకి వచ్చిన నత్తలను బయట పడేయాలనుకుంటే ప్రొటెక్టివ్ గేర్ లాంటిది చేతులకు తొడుక్కోవాలని అధికారులు సూచిస్తున్నాకాగా రు. ఇలాంటి నత్తల్ని పంపిణీ చేయడం, విక్రయించడం, నౌకల్లో తరలించడం అమెరికాలో చట్ట విరుద్ధం.

 

Tags: Snails shaking America

Leave A Reply

Your email address will not be published.