Natyam ad

ప్రాణాలు తీస్తున్న పాములు

కాకినాడ ముచ్చట్లు:


అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలంలో పాముల బెదడతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో పాముకాటుకు ఇద్దరు బలవ్వడంతో ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకే కరువవుతున్న పరిస్థితి నెలకొంది. ఏ టైంలో ఎటునుంచి పాము వస్తుందనే ఆందోళనలో బతుకుతున్నారు ఇక్కడి వాసులు. అసలే వర్షా కాలం.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో చెట్ల పొదలు, తుప్పల్లో పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో ఎప్పుడు పాము కాటు బారిన పడతామో అనే ఆందోళన నెలకొంది. మొత్తానికి అంబెద్కర్ కోనసీమ జిల్లాలో పాములు ప్రజలను బెంబేలెతిస్తున్నాయి. రాత్రి సమయాల్లో అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ విష సర్పాలు. ఇళ్లలోకి చేరి కాట్లు వేస్తుండటంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల బాలుడు పాముకాటుకి గురయ్యి మృతి చెందాడు. అలాగే తమ ఇళ్లలోకి కూడా పాములు వస్తున్నాయని గ్రామానికి చెందిన పలువురు చెబుతున్నారు.

 

 

బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పై కప్పు నుండి బాలుడిపై పాము పడి కాటు వేసింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది. మరోవైపు 15రోజుల క్రితం మామిడికుదురు లో పాము కాటుకు బలై కొబ్బరి వలపు కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.కోనసీమ జిల్లాలో గత వారం రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలోకి వచ్చి కాట్లు వేస్తుండటంతో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని, పాములను కట్టడి చేయాలని కోనసీమ వాసులు కోరుతున్నారు.

 

Post Midle

Tags: Snakes that take lives

Post Midle

Leave A Reply

Your email address will not be published.