Date:29/11/2020
వీకోట ముచ్చట్లు:
గ్రామస్థులు రాకపోకలకు పూర్తిగా అంతరాయం…జరిగిన సంఘటన గురించి పంచాయతి సెక్రెటరీ కి మరియు వి.ఆర్.ఓ లకు తెలియబరిచిన పట్టించుకోకపోవడం చాల దారుణం.వీకోట మండల కేంద్రంలోని జౌనిపల్లి పంచాయతీ చెరువు ముందరపల్లి గ్రామంలో గత రెండు రోజులు నుండి కురిసిన భారీ ఈదురు గాలుల వర్షం వల్ల గ్రామస్థుల నిత్యం పనులు చేపట్టే దారిలో పెద్ద తుమ్మ చెట్లు పడటంతో గ్రామస్తులు స్థానిక సెక్రటరీ మరియు వి.ఆర్.ఓ లకు జరిగిన సంఘటన గురించి వెలియబుచ్చిన పట్టించుకోకపోవడం చాల దారునం. రెండు రోజుల నుండి ఈసమస్య పై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల ఆవేదన.అదేవిధంగా సరైన రహదారి లేకుండా సంవత్సరాలకొద్దీ తీవ్ర ఇబ్బందుల పడుతున్న రైతన్నల పలు సార్లు నాయకులకు మరియు అధికారులకు తెలియబరిచిన ఫలితం మాత్రం శూన్యo.గతంలో కూడ ఇలాగే వర్షం పడి చెట్లు అడ్డంగా ఉంటే స్థానిక గ్రామస్థుడు దాన్ని తొలిగించినందుకు రాజకీయ కులగజ్జి తో అతనికి 18500 రూపాయిలు జరిమానా వేసిన ఘటన కూడ జరిగింది….అలాంటి దౌర్భాగ్యం కు వడిగట్టిన వారి వల్ల ఈరోజు గ్రామస్తులు కూడ ముందుకు రాకపోవడం.
గ్రామస్థుల ఆవేదన…
సంబంధిత అధికారాలు,సచివాలయ సిబ్బంది ఉన్నది ప్రజలు సమస్యలు తీర్చడానికా…????లేదా నాయకుల మూతులు…….అని గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు.సర్కార్ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లండని పదే…పదే సభల్లో బీరాలు పలుకుతుంటే జౌనిపల్లి సచివాలయంలో మాత్రం ఉలుకు పలుకు లేని యంత్రాగం ఉండటం…..ఆ పంచాయతీ గ్రామస్థుల దౌర్బగ్యం.
Tags: Sneezing sneezes on the ground due to strong winds