జమ్మూ కాశ్మీర్‌ను ముంచేస్తున్న మంచు తుఫాను
శ్రీనగర్ ముచ్చట్లు:

జమ్మూకశ్మీర్‌ను మంచుతుఫాను ముంచేస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్‌లో మంచు తుపాను విధ్వంసం సృష్టించింది. సోనామార్గ్ జమ్మూ, కాశ్మీర్‌లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ బాల్తాల్ ప్రాంతానికి సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా జమ్మూకశ్మీర్‌లో హిమపాతం ఏ స్థాయిలో కురుస్తోంది స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది ప్రజలు ఈ మంచుతుఫానులో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గల్లంతైన వారిలో ఒక కార్మికుడు మరణించినట్టుగా తెలిసింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఒక నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు తప్పిపోయినట్టుగా ప్రకటించింది. వారిలో ఒకరి మృతదేహం వెలికితీశారు. బాధితుడిని కిష్త్వార్కు చెందిన సందీప్‌గా గుర్తించారు. మరో కార్మికుడు మంచు కింద కూరుకుపోయాడు. హిమపాతం సింధ్ నది ప్రవాహాన్ని కూడా స్తంభింపజేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. కొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

నివేదికల ప్రకారం, జమ్మూకశ్మీర్ ప్రాంతంలో రెండు హిమపాతాలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, లోయకు ప్రవేశ ద్వారం అయిన ఖాజీగుండ్‌లో కనిష్టంగా 1.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌గా పనిచేసే అనంతనాగ్ జిల్లాలోని పర్యాటక విహార కేంద్రం పహల్గామ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని సమాచారం.కాశ్మీర్లో ఈ 40 రోజుల కాలం అత్యంత కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కశ్మీర్లో అతి శీతల వాతావరణం డిసెంబరు 21న ప్రారంభమై జనవరి 30న ముగుస్తుంది. ఆ తర్వాత కూడా 20 రోజుల పాటు కొనసాగే మంచువర్షం, 10 రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయి.
Tags: Snow storm engulfs Jammu and Kashmir
