అలా ముందుకు వెనక్కి రైల్వే జోన్ అడుగులు
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ రైల్వేజోన్ వ్యవహారం. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి విశాఖ రైల్వేజోన్ ని తాయిలంలా చూపింది. ఎన్నికలకు ముందు ఆ తాయిలం చూపించి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంది. అనేక రాష్ట్రాలకు ఇచ్చి న హామీలతో పాటు ఆంధ్రాకు సంబంధించిన విశాఖ రైల్వేజోన్ సంగతి కూడా అటకెక్కించింది మోదీ సర్కారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉందని మంత్రులు, ఏంపీలు, సీఎం కూడా ప్రజలకు చెబుతూనే ఉన్నారు. కానీ కేవలం చెప్పడం, వారు మభ్యపెట్టడమే ఇన్నాళ్లూ జరుగుతోంది. వీరి మధ్య విశాఖ జోన్ విషయంలో భాషాంతరమేమన్నా ఉందేమోననుకున్నారంతా. అదేమీ కాదు కేంద్రం కావాల నే జాప్యం చేస్తున్నదని ఇటీవలే బాగా స్పష్టమయింది. ప్రధాని సుముఖానికి చాలాసార్లు వెళ్లిన సీఎం జగన్ ఈ అంశాన్ని గురించి అసలు చర్చించారో లేదో ఇంతవరకూ తెలీదు. అసలు ఆయన పర్యటనల సారాంశం ఎప్పుడూ రహస్యమే. అందుకే ఆయన స్వంత పనులమీద వెళ్లివస్తున్నారన్న ఆరోపణలే ఎ క్కు వయ్యాయి. ఇహ ఇప్పుడు కేంద్రానికి అసలు దాన్ని గురించి ఆలోచించే సమయమే లేదని అంటు న్నది.
ఎవరు ఎవర్ని భ్రమలో పెట్టారన్నది దీన్నిబట్టీ తెలుస్తోంది. గతంలో కేంద్రమే తీసుకున్ననిర్ణయాన్ని వారే నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వారికి అవసరమైన సమ యంలో రాష్ట్రానికి కావలసినవి చేస్తామనడం, ప్రజలు, నాయకుల మాటని విన్నట్టు నటించడం తప్ప వాస్తవానికి ఏమీ ఆలోచించడం లేదు. అన్నింటికంటే విచిత్రమేమంటే ఎలాంటి రైల్వే జోన్ లేదనీ చెబు తూండడం. మరోవంక బీజేపీ నేతలు ఇచ్చేశామని ప్రచార హడావుడి చేయడం. దీనికి తోడు గత ఫిబ్రవరి లో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంటులోనే కేంద్రం తేల్చి చెప్పేసిం ది. ఇక కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు. అసమర్ధ పాలకుడు, మాటలు నేర్చిన మాంత్రికుడితో కలిస్తే ఇలానే ఉంటుంది. కేంద్రం కేవలం కబుర్లు చెప్పడం తప్ప కొత్త రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదన్న అభిప్రాయాలకు ఇది మరింత ఊతమిస్తోంది. కేంద్రం విశాఖ రైల్వేజోన్ అంశాన్ని పాతబడ్డ చింతకాయపచ్చడిగా పేర్కొంటూ దాన్ని గురించి చర్చోప చర్చలు చేయడం శుద్ధ దండగ అంటోంది. పైగా వాల్లేరు డివిజన్‌ను ఓడిషాలో కలిసేసింది. చిత్రమే మంటే, విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను లాగేసు కుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర దాసోహం అంటూండటమే అందుకు కారణమనే విమర్శలు వినపడుతు న్నాయి.
Tags: So back and forth railway zone steps