Natyam ad

అక్కడ అలా.. ఇక్కడ ఇలా

విజయవాడ ముచ్చట్లు:
 
మరో 10 రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. అతి పెద్ద పండగ కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడతారు. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పండుగకు ముందు 4,145 బస్సులు, ఆ తర్వాత 2825 బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 8వ తేదీ నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ వసూలు చేయనుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు 1500 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల టీఎస్ఆర్టీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులను రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు సహా ఏపీలోని పలు పట్టణాలకు, కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం అదనపు ఛార్జీలు లేకుండానే పండుగకు ప్రత్యేకంగా బస్సులను నడపనుంది.
 
 
ఆర్టీసీ టిక్కెట్ల ధరలు తగ్గిస్తారా
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సొంత రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ఏపీలోని ప్రజలు పలు ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నారని.. అలాంటి వారు సంక్రాంతి పండక్కి ఆర్టీసీ బస్సుల్లో రావాలంటే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వారు ప్రయాణించే బస్సుల్లో టిక్కెట్ ధరలను ఇష్టం వచ్చినట్లు 50 శాతం పెంచేశారని… సామాన్యుల కోసం ఆర్టీసీ టిక్కెట్ ధరలను తగ్గించే దమ్ము జగన్‌కు ఉందా అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అవి పట్టించుకోవడం మానేసి… సినిమా టిక్కెట్ ధరలను తగ్గించడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: So there .. Like here