కాంగ్రెస్ ను గెలిపించిన సామాజిక వర్గాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన కుల రాజకీయాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోకి ప్రవేశించాయి. ఆంధ్రాలో కమ్మ, కాపులు ఎటువైపు ఉంటే.. విజయం వారినే వరిస్తుంది. అచ్చం అలాగే తెలంగాణలో కమ్మ, రెడ్డు ఒక్కటై ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇందుకు స్పష్టమైన నిదర్శనం తెలంగాణలో అన్ని పార్టీల్లో కలిపి 43 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎన్నిక కావడం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ముస్లింలు మినహా ఎవరూ గెలవడం లేదు. ఇవి కాకుండా రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 31 ఉన్నాయి. మొత్తం 38 స్థానాలు వదిలేస్తే 81 జనరల్‌ స్థానాలు ఉన్నాయి. ఇందులో 43 మంది రెడ్లు విజయం సాధించారు. గెలిచిన 43 మందిలో మూడు ప్రధాన పార్టీలకు చెందినవారు ఉండడం అగ్రవర్ణాలు ఒక్కటయ్యాయి అనేందుకు నిదర్శనం.కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అగ్రవర్ణాలు కమ్మ, కాపులు ఏకమయ్యారు. కానీ ఇలాంటి ఐక్యత బీసీల్లో కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఎస్టీ వర్గీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, ఇటు బీసీలు, అటు ఎస్సీ(మాదగ)లు బీజేపీని ఆదరించలేదు. ఎందుకంటే.. బీజేపీ నుంచి ఒక్క ఎస్సీ కూడా గెలవకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక బీసీలు గెలిసింది కూడా రిజర్వు స్థానాల్లోనే.. జనరల్‌ స్థానంలో ఒక్క బీసీని కూడా బీసీలు గెలిపించుకోలేకపోయారు. కమ్మ, రెడ్లు కలిసిపోయినట్లుగా బీసీలు ఐక్యత చాటి ఉంటే.. 43 జనరల్‌ స్థానాల్లో రెడ్లు గెలిచేవారు కాదు.పరిస్థితి చూస్తుంటే.. ఆంధ్రా తరహాలో తెలంగాణ కూడా కుల రాజకీయం క్రమంగా చొచ్చుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. అన్ని కులాలు ఇలా చొచ్చుకు వచ్చి ఉంటే.. ఎవరికీ నష్టం ఉండేది కాదు. కానీ కేవలం అగ్రవర్ణ కులాలు మాత్రమే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్రవర్ణాల చేతుల్లోకే వెళ్లిపోవడం

 

Tags: Social groups that won the Congress

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *