సోషల్ మీడియా పనితీరు అభినందనీయం
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కర్నూల్ నగరం మేయర్ బీ .వై.రామయ్య
కర్నూలు ముచ్చట్లు:

వైయస్ఆర్‌సిపి సోషల్ మీడియా సభ్యుల పనితీరు అభినందనీయమని వైయస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బి.వై. రామయ్య ప్రశంసించారు. మంగళవారం జిల్లా కన్వీనర్ ఎం.ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల వైయస్ఆర్‌సిపి సోషల్ మీడియా జిల్లా కో-కన్వీనర్‌గా నియమితులైన గొల్ల మధుశేఖర్ బి.వై. రామయ్యను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. గతంలో కోడుమూరు నియోజకవర్గ కో-కన్వీనర్‌గా పనిచేసిన మధుశేఖర్ ఇప్పుడు జిల్లా కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బి.వై. రామయ్య మాట్లాడుతూ కష్టపడ్డా కార్యకర్తకు గుర్తింపు ఇవ్వడంలో వైయస్ఆర్‌సిపిని మించిన పార్టీ లేదన్నారు. ఒకవైపు ప్రతిపక్షాల వైఖరి, అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి వైయస్ఆర్‌సిపి సోషల్ మీడియా సభ్యులు బలంగా తీసుకెళ్తున్నారని కొనియాడారు. మరింత ఉత్సాహంతో ఎన్నికల వరకు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మధుసూదన్, కో-కన్వీనర్ గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Social media performance is commendable
