మంత్రి గారి పని పెట్టిన సోషల్ మీడియా 

Date:08/10/2018
జైపూర్  ముచ్చట్లు:
స్వచ్ఛ భారత్.. దేశవ్యాప్తంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన బృహత్తర కార్యక్రమం. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత దేశంగా మార్చేందుకు.. ప్రజలతో పాటూ ప్రజా ప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కాని కొందరు నేతలు మాత్రం స్వచ్ఛ్ భారత్‌కు తూట్లు పొడుస్తున్నారు. ప్రజలకు మంచి చెప్పాల్సిందిపోయి.. వారే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రిగారి బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అడ్డంగా బుక్కయ్యారు. అసలు విషయానికొస్తే.. రాజస్థాన్‌లో ఎన్నికల నగారా మోగడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో భాగంగా.. రాష్ట్ర మంత్రి శంభూ సింగ్‌ బీజేపీ అజ్మీర్‌లో పర్యటించారు. అయితే అమాత్యులవారికి అర్జంటైనట్లుంది.. వెంటనే ఓ గోడ దగ్గరకు వెళ్లి పనికానిచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. ఆ గోడకు ఓ బీజేపీ ఫ్లెక్సీ కూడా ఉండటం. ఇలా మంత్రి బహిరంగ మూత్ర విసర్జన చేయడాన్ని ఎవరో ఫోటో తీశారు. అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది.
Tags:Social media that worked for the minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *