సంఘ సంస్కర్త యోగివేమన- ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్
కడప ముచ్చట్లు:
తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన అని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ కొనియాడారు. గురువారం యోగి వేమన జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి యోగి వేమన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, వేమన మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి, ఏ.ఆర్ అదనపు ఎస్.పి ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, ఏ.ఆర్ డి.ఎస్.పి బి.రమణయ్య, ఆర్.ఐ లు వీరేష్, సోమశేఖర్ నాయక్, ఆర్.ఎస్.ఐ లు, డి.పి.ఓ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Social reformer Yogivemana- SP KKN Anburajan

