జర్నలిస్టులను ఆదరించడం సామాజిక బాధ్యత- సామాజికవేత్త డాక్టర్ సునీల్ కుమార్

నెల్లూరు ముచ్చట్లు :

 

జర్నలిస్టులను ఆదరించడం సామాజిక బాధ్యత అని ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ కోట సునీల్ కుమార్  పేర్కొన్నారు .నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జర్నలిస్టులకు  ఆయన  నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు చాలామందికి జీతభత్యాలు లేవని , అయినా విధి నిర్వహణలో భాగంగా కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ,విధులు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఎందరో జర్నలిస్టులు మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు  . జర్నలిస్టులకు ప్రభుత్వంతోపాటు, ప్రజలు ఆదరించి, సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు . ఈ సందర్భంగా విక్రమ సింహపురి  గా యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్  ఎల్. విజయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం జర్నలిస్టులు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా   తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తున్నారన్నారు  .

 

 

 

అనంతరం  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ మాట్లాడుతూ  కరోనా సమయంలో రాష్ట్రంలో 84 మంది జర్నలిస్టులు మరణించారని, దేశవ్యాప్తంగా ఎందరో మృతి చెందారని అన్నారు  .మరణించిన జర్నలిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయలు తక్షణమే అందించాలని ఆయన కోరారు  .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఉచిత విద్య ,వైద్య వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు  .కోట సునీల్ కుమార్  గతంలో కరోనా వచ్చినపుడు గూడూరు నెల్లూరు జర్నలిస్టులను  అన్ని విధాలా సహాయ పడ్డారని  ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు  .జర్నలిస్టులతోపాటు  వలస కార్మికులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 4 నెలలు భోజనం ఇతర సౌకర్యాలు అందించిన ఘనత కోట సునీల్ కుమార్ కే దక్కుతుందని ఆయన అభినందించారు   .ఈ సందర్బంగా లోకకల్యాణార్థం యాగాలు నిర్వహించారు  .జర్నలిస్టులు కోట సునీల్ కుమార్ను  సత్కరించారు  .ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు  .

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Social responsibility to support journalists – Sociologist Dr. Sunil Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *