SodiumSpray in the Municipality for Corona Control

కరోనా నియంత్రణకు మున్సిపాలిటిలో సోడియంస్ప్రే

Date:10/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పట్టణంలో నిర్వహిస్తూ సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో 230 మంది కార్మికులు, అగ్నిమాపక యంత్రం, పది ట్రాక్టర్లలో ద్రావణాన్ని స్ప్రే చేశారు. అలాగే ప్రత్యేక యంత్రాల ద్వారా ఫాగింగ్‌ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని ఎనిమిది వారాలు పూర్తి చేశామన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో కరోనా నియంత్రణలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి పర్యవేక్షణలో అన్నిశాఖల అధికారులు సమిష్టి కృషితో పని చేస్తున్నామన్నారు. ప్రజలందరు భౌతికదూరం పాటిస్తూ తమ ఇండ్లలోనే ఉండాలన్నారు. నిత్యవసర వస్తువుల కోసం ఒకరు మాత్రమే రావాలని సూచించారు. ప్రజలు లాకౌడౌన్‌ను జయప్రదం చేసేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెసిటివి అధినేత ముత్యాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ పాల్గొన్నారు.

మన సంస్కృతిని ఆదర్శంగా తీసుకుందాం.

Tags: SodiumSpray in the Municipality for Corona Control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *