సాఫ్ట్వేర్ సినిస్టార్` పరిశ్రమకు కొత్త జోష్

హైదరాబాద్  ముచ్చట్లు:

డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు భద్రతపై అవగాహన వంటి సామాజిక బాధ్యతతో కూడిన షార్ట్ ఫిలింల రూపకల్పన, వ్యవసాయం యొక్క ప్రాధాన్యత తెలియజేసే `ఊరెళ్లిపోతా మామ` సినిమాల్లో హీరో పాత్ర ద్వారా `సాఫ్ట్వేర్ సినిస్టార్` ప్రత్యేకతను సాఫ్ట్వేర్ ఇంజినీర్ వరుణ్ ఆర్ల సొంతం చేసుకున్నారని తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం ప్రశంసించారు. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న వరుణ్ ఆర్ల తాజా చిత్రం ఊరెళ్లిపోతా మామ సినిమా `ఆహా`లో విజయవంతంగా స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా ఆయనకు `సాఫ్ట్వేర్ సినిస్టార్` అవార్డును నేడు ఓ కార్యక్రమంలో అనిల్ కుర్మాచలం బహుకరించారు. యువ టెక్కీని వెన్నుతట్టి ప్రోత్సహించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తలను ఈ సందర్భంగా అనిల్ కుర్మాచలం ప్రత్యేకంగా అభినందించారు.
అంజన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఊరెళ్లిపోతా మామ సినిమాలో శ్రీమానస్, వరుణ్ ఆర్ల హీరోలుగా మరినా సింగ్, సహర్ క్రిష్ణ హీరోయిన్లుగా నటించారు. సుప్రసిద్ధ నటుడు శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్ర పోషించారు. నగర శివారులోని ఫాంహౌస్ లాక్ డౌన్లో ఓ రాత్రి గడిపిన అంశాన్ని ఆధారంగా తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వ్యవసాయం గురించి తెలుసుకొని అన్నదాతలకు అండగా ఉండటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

 

ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న వరుణ్ కంపెనీ యొక్క థియేటర్ క్లబ్లో థియేటర్ ఆర్టిస్టుగా సుప్రసిద్ధుడు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన `లవ్ స్టోరీ` సినిమాలో ఆయన నటించారు. కార్గిల్ దివస్ పురస్కరించుకొని `ఏక్ ఔర్ షహీద్` పేరుతో  మైమ్ రూపొందించారు. స్వచ్ఛ భారత్పై రూపొందించిన సామాజిక అంశంతో కూడిన షార్ట్ ఫిలిం, ప్లాస్టిక్ భూతంపై రూపొందించినవి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్యం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు `యాంటీ కరోనా వైరస్ సాఫ్ట్వేర్` రచనను ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు డ్రంకెన్ డ్రైవ్ మరియు రోడ్డు భధ్రత అంశాలపై  వరుణ్ స్వయంగా స్క్రిప్ట్ రాసుకొని నటించిన షార్ట్ ఫిలింలను రూపొందించగా ఆయా అంశాల్లో అవగాహన కోసం  పోలీసు విభాగం విస్తృతంగా ఉపయోగించింది. ప్రముఖ దర్శకులు సైతం ఈ షార్ట్ ఫిలింలను అభినందించడం విశేషం. రోడ్డు భద్రతపై ఆర్టీసీ వీసీ & ఎండీ సజ్జనార్ ప్రతిపాదన మేరకు ఓ షార్ట్ ఫిలిం, సైబర్ హ్యాక్ అంశంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కోరిక మేరకు మరో షార్ట్ ఫిలిం రూపొందించారు. వరుణ్ ఆర్లలో ఉన్న నైపుణ్యాలను గుర్తించిన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల మద్దతు & ప్రోత్సాహంతో వరుణ్ టీటా మద్దతుతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా వ్యవసాయం ఇతివృత్తంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆలోచనను మార్చే రీతిలో ఉన్న `ఊరెళ్లిపోతా మామ` సినిమా టెక్కీల ఆదరణ పొందుతున్న తరుణంలో ఆయనకు `సాఫ్ట్వేర్ సినీస్టార్` బిరుదును  తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం అందజేశారు.

 

 

ఈ సందర్భంగా తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ ఇన్ఫోసిస్లో నటన నైపుణ్యాన్ని సామాజిక ఇతివృత్తంతో కూడిన సినిమాలకు వినియోగిస్తున్న వరుణ్ అభినందనీయుడని పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు భద్రత, వ్యవసాయం యొక్క ఆవశ్యతక వంటి ఇతివృత్తాలతో సినిమా, షార్ట్ఫిలింలు రూపొందించిన వరుణ్ `సాఫ్ట్వేర్ సినీస్టార్` అవార్డుకు మరింత హుందాతనాన్ని తెస్తారని ప్రశంసించారు.

 

Tags: Software Sinistar’ is a new josh to the industry

Leave A Reply

Your email address will not be published.