ఆకతాయికి చుక్కలు చూపించిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయి

Date:04/01/2020

హైదరాబాదు ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతం అది. నిత్యం జనసంచారం ఉండే రహదారి. 4 నెలల గర్భిణి అయిన ఓ ఐటీ ఉద్యోగిని నడుచుకుంటూ అదే రహదారిపై తాను పనిచేసే కంపెనీకి వెళుతున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె నిందితుడి చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీయడంతో దాడికి యత్నించాడు. అయినా ఆమె భయపడలేదు. ధైర్యంగా ఎదురు దాడి చేసింది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్‌ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 8 గంటలకు విధులకు వచ్చారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్సార్ చౌరస్తాకు వెళ్లారు. భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోగా ఆమె ఫోన్‌‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ సమీపంలో ఉన్న కంపెనీకి బయల్దేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా తాకాడు.దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆమె తలపైకి ఎత్తి చూడగా అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే అతడిని వెంబడించి నిలదీసింది. సమాధానం చెప్పకుండా నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. అతడిపై ఎదురు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో చుట్టటుపక్కల వారు గమనించి అతడిని పట్టుకున్నారు. వెంటనే బాధితురాలు 100కు ఫోన్‌ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

 

మంత్రి బొత్స రాహు, కేతు పూజలు

 

Tags:Software used to show the dots for the mob

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *