Natyam ad

పుంగనూరులో సౌరవెలుగులు

-పుంగనూరులో రూ.6 కోట్లతో సోలార్‌ ప్లాంటు
-ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి
-మున్సిపాలిటికి నెలకు రూ.35 లక్షలు ఆదా
-జనవరిలో ఉత్పత్తి ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

సౌరవిద్యుత్‌తో పుంగనూరు మున్సిపాలిటిలో వెలుగులు విరజిమ్మనున్నాయి. పుంగనూరుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎంపీ పెద్దిరెడ్డి వెంటకమిధున్‌రెడ్డి ల కృషితో పరిశ్రమలు నెలకొల్పుతుండగా తాజాగా పుంగనూరు మున్సిపాలిటికి పెనుభారంగా మారిన విద్యుత్‌ బిల్లుల నుంచి ఉపశమనం కలిగేలా సొంతంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. ఈపనులకు సంబంధించి మంగళవారం నిరారంబరంగా అధికారులు భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత వరకు ఈ సోలార్‌ ప్రాజెక్టు ద్వారా అవసరమైన విద్యుత్‌ను సద్వినియోగం చేసుకొని మిగులు విద్యుత్‌ విక్రయించుకునే విధంగా ఆలోచిస్తున్నారు.

రూ.6 కోట్ల సిఎస్‌ఆర్‌ నిధులు…

పుంగనూరు సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకు వద్ద సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. సంబంధించిన నిధులు మున్సిపాలిటి భరించేందుకు కష్టం కావడంతో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి లు దీనిపై కసరత్తు చేశారు. చివరకు కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్‌) నిధులతో ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఈ నిధులతో ఈనెలలోనే పనులు ప్రారంభించి , జనవరి వెహోదటి వారానికి అంతా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించి, పుంగనూరు మున్సిపాలిటికి వినియోగించుకోనున్నారు.

 

ఒక మెగావాట్‌ ఉత్పత్తి ….

పుంగనూరు సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఒక మెగా వాల్ట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. దీనికి అనుగుణంగానే సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పుంగనూరు మున్సిపాలిటికి సంబంధించిన వీధి దీపాలు మున్సిపల్‌ కార్యాలయం, తాగునీటి పథకాలు, తదితర వాటికి రోజుకు 4వేల యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంది. ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ మున్సిపాలిటి అవసరాలకు పోను ఇంకా మిగులుతుంది.

డిస్కం ద్వారా సరఫరా….

సౌరప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ నేరుగా డిస్కం సబ్‌ స్టేషన్‌కు అవుతుంది. అక్కడి నుంచి మున్సిపాలిటి అవసరాలకు విద్యుత్‌ వినియోగించడం జరుగుతుంది. ప్లాంట్‌ నుంచి ఎంత విద్యుత్‌ డిస్కంకు సరఫరా అవుతుంది. ఎంత విద్యుత్‌ మున్సిపాలిటి వినియోగించుకుంది లెక్కలు వేస్తారు. సరఫరా అయిన విద్యుత్‌ కంటే తక్కువ విద్యుత్‌ వినియోగమైన పక్షంలో మిగిలిన విద్యుత్‌కు సంబంధించి డిస్కౌంట్‌ వినియోగించుకున్నందుకు తిరిగి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్లాంట్‌ ఏర్పాటు వల్ల మున్సిపాలిటికి అన్ని విధాల ప్రయోజనం .

రూ.5.25 కోట్ల ఆదా….

సౌరప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభం ద్వారా పుంగనూరు మున్సిపాలిటికి ఏడాదికి రూ.5.25 కోట్లు ఆదా అవుతాయి. ప్రస్తుతం నెలకు రూ.35 లక్షల విద్యుత్‌ వినియోగం అవుతోంది. సౌరప్లాంట్‌ వినియోగంతో ఖర్చు మిగులుతుంది. దీని ద్వారా మున్సిపాలిటిలో అదనంగా ప్రజలకు అవసరమైన వసతులు, అభివృద్ధి పనులు చేపట్టవచ్చు.

 

విద్యుత్‌ ను ఆదా చేసేందుకు…

మున్సిపాలిటిలో ప్రతి యేటా సుమారు రూ.4 కోట్ల రూపాయలు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం జరుగుతోంది. దీని ద్వారా మున్సిపాలిటికి అధికభారం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రణాళికలు ఏర్పాటు చేశాం. పట్టణంలోని మోటార్లు, వీధి దీపాల వినియోగానికి ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంట్‌ను రూ.6 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండేళ్లలో ప్లాంటు నిర్మాణ ఖర్చు రాబట్టుగలుగుతాం. పూర్తి స్థాయిలో సోలార్‌ను అమలుల్లోకి తీసుకొచ్చి విద్యుత్‌ ఆదాచేస్తాం.

– రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అన్ని రంగాల్లో అభివృద్ధి….

పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రూ.6 కోట్లతో సోలార్‌ప్లాంటు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం. విద్యుత్‌ బిల్లులకైయ్యే మున్సిపల్‌ నిధులను మౌలిక వసతుల ఏర్పాటుకు ఖర్చు చేస్తాం. ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులతో పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేసి, ఆదర్శంగా నిలుపుతాం.

– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట.

సత్వరమే పనులు….

సౌరప్లాంట్‌ పనులు వెంటనే జరుగుతాయి. సిఆర్‌ఎస్‌ఆర్‌ నిధులతో ప్రాజెక్టు చేపడుతున్నాం. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కృషితో మంజూరైంది. మున్సిపాలిటికి ఈ ప్లాంట్‌ ఆదాయ వనరుగా కూడ ఉపయోగపడుతుంది.

– నరసింహప్రసాద్‌, కమిషనర్‌ , పుంగనూరు.

 

Tags: Solar lights in Punganur

Post Midle